MLG: BC స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో విదేశీ విద్య కోసం ఉచిత IELTS శిక్షణకు దరఖాస్తు గడువును జనవరి 11 వరకు పొడిగించినట్లు MLG జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి సర్దార్ సింగ్ తెలిపారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన BC విద్యార్థులు అర్హులని ఆయన అన్నారు. ఆన్లైన్లో బీసీ స్టడీ సర్కిల్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.