రణస్థలం మండలంలోని పైడిభీమవరం రహదారిపై మంగళవారం జరిగిన ప్రమాదంలో మహిళ మృతి చెందింది. ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం సీ.హెచ్. ఆగ్రహారం గ్రామానికి చెందిన శీల అచ్చయ్యమ్మ (40) రోడ్డు దాటుతుండగా శ్రీకాకుళం–విశాఖపట్నం వైపు వెళ్తున్న లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.