SRD: కొత్త ఏడాది వేడుకల్లో మద్యం తాగి వాహనాలు నడిపితే జరిమానా, జైలు శిక్ష తప్పదని కంగ్టి CI వెంకట్ రెడ్డి నేడు తెలిపారు. నిబంధనలకు లోబడి వేడుకలు జరుపుకోవాలని, ఇతరులకు ఇబ్బందులు కలిగించొద్దన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల సంరక్షణకు హైవేలు, రోడ్లపై కేక్ కట్ చేయొద్దని, హోటల్స్, రెస్టారెంట్స్ సమయ పాలన పాటించాలన్నారు.