EG: వాట్సాప్ ద్వారా ఆర్టీసీ బస్ టికెట్లను సులభంగా పొందవచ్చని కొవ్వూరు డిపో మేనేజర్ ఎన్ఏ. నాయక్ మంగళవారం తెలిపారు. 9552300009 నంబర్‌కు ‘హాయ్’ అని మెసేజ్ పంపి ఈ సేవలు పొందవచ్చన్నారు. ఈ విధానం వల్ల ప్రయాణికులకు సమయం ఆదా అవుతుందని, క్యూలో నిలబడాల్సిన అవసరం ఉండదని ప్రయాణ తేదీ, గమ్యస్థానాన్ని నమోదు చేసి ఆన్లైన్ పేమెంట్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చన్నారు.