మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలకొండ బైపాస్ వద్ద ఉన్న తిరుమలనాథ స్వామి దేవాలయంలో నేడు శ్రీనివాస కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఉదయం 11 గంటలకు కళ్యాణం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఈ వేడుకకు పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున హాజరుకావాలని కోరారు. అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.