NLR: పేదలకు సొంత ఇంటిని పూర్తి చేసి ఇవ్వడమే ప్రధాన లక్ష్యంగా గృహనిర్మాణ శాఖ అధికారులు ప్రత్యేక కార్యాచరణతో పనిచేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ MD పి.అరుణ్ బాబు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో కలెక్టర్ హిమాన్షు శుక్లతో కలిసి జిల్లాలో గృహనిర్మాణాల పురోగతిపై అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు