SRCL: మహిళల కష్టాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ప్రవేశపెట్టిందని బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం పదిరలో మహిళలకు మంజూరైన ఉచిత సిలిండర్లను మంగళవారం ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బుగ్గారెడ్డి, సత్యంరెడ్డి, సాయికుమార్, నర్సింలు, పర్శరాంరెడ్డి పాల్గొన్నారు.