VZM: బొండపల్లి మండలం గరుడబిల్లి (RBK) రైతు సేవా కేంద్రాన్ని జిల్లా వ్యవసాయ అధికారి ( DAO) వీ. టీ రామారావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా హాజరైన రైతులను ఉద్దేశించి అధిక యూరియా వాడకం అనర్ధాలపై ఆవగాహన కల్పించారు. ప్రస్తుతం రబీ పంటకాలంలో సాగు చేస్తున్న అన్ని పంటలకు అవసరమైన యూరియా విడతల వారీగా సరఫరా చేస్తామని ఆయన తెలిపారు.