MDK: ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి తీవ్రత తగ్గడం లేదు. అత్యల్పంగా కొహీర్‌లో 6.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. సిద్దిపేట జిల్లా అంగడి కృష్ణాపూర్‌లో 9.4, మెదక్ జిల్లా నర్సాపూర్‌లో 9.7 అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయింది. రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.