KRNL: జిల్లాలో ఈ ఏడాది ఐదుగురిపై జిల్లా బహిష్కరణ వేటు అమలు చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవరం తెలిపారు. 2025 క్రైమ్ రివ్యూ మీటింగ్లో ఆయన మాట్లాడారు. మొత్తం 11 మందిపై ప్రతిపాదనలు పంపగా, పరిశీలన అనంతరం ఐదుగురిపై బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. గతంలో సమస్యలు సృష్టించిన పాత నేరస్థులను గుర్తించి 2,539 మందిని బైండోవర్ చేస్తామన్నారు.