ప్రకాశం: రాచర్ల మండలంలోని రంగారెడ్డి పల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తుని నుంచి అనంతపురం వెళ్తున్న డ్రై ఫ్రూట్స్ మినీ డీసీఎం వాహనంను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో అనంతపురం జిల్లాకు చెందిన ఎర్రి స్వామి సజీవ దహనం కాగా, జయరామిరెడ్డి అనే మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.