ADB: జిల్లాలో ఆహార భద్రత ప్రమాణాలను పటిష్టంగా అమలు చేయడంపై సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన ఆహార భద్రతపై జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. గత త్రైమాసికంలో ఆహార భద్రతా శాఖ చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్ చర్యలు, తనిఖీలపై సమీక్షించినట్లు తెలిపారు.