ATP: రాయలచెరువు వద్ద రైల్వే గేట్ క్రాసింగ్ విస్తరణ పనులు చేపడుతున్నారు. దీంతో జనవరి 2 నుంచి 6వ తేదీ వరకు ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు తహసీల్దార్ ప్రతాప్ రెడ్డి మంగళవారం తెలిపారు. ట్రాఫిక్‌ను రాయలచెరువు-వేములపాడు-పెద్దపేట బైపాస్ రోడ్డు ద్వారా మళ్లిస్తున్నట్లు తెలిపారు. వాహనదారులందరూ సహకరించాలని కోరారు.