కృష్ణా: మచిలీపట్నం STF అధికారులు సారా బట్టీలపై ఉక్కుపాదం మోపారు. STF సీఐ లక్ష్మణరావు తన సిబ్బంది, గోకవరం VRO శివనాగ ప్రసాద్లో కలిసి గోకవరం పంచాయతీ రెడ్డిపాలెం శివారు ప్రాంతాల్లో మెరుపు దాడులు చేశారు. ఈ సోదాల్లో నాటుసారా కాస్తున్న వెంకటరెడ్డి, బాలకృష్ణలను అరెస్ట్ చేసి, వారి నుంచి 15 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యలయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తెలిపారు.