WG: బ్యాంకులకు ఐదు రోజుల పనిదినాలను అమలు చేయాలని మంగళవారం పాలకొల్లులో యునైటెడ్ ఫార్మ బ్యాంకింగ్ యూనియన్ సభ్యులు నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఐదు పనిదినముల ప్రతిపాదనను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ SBI, యూనియన్ బ్యాంక్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ సిబ్బంది నినాదాలు చేశారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు సురేంద్ర, ప్రసాద్ బాబు, శేఖర్ పాల్గొన్నారు.