AP: రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లోనూ వ్యాయామ విద్య నేర్పించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. స్కూళ్లలో యోగా, డ్రిల్, క్రీడలు నిర్వహించాలని సూచించింది. పదో తరగతి వరకు విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని తెలిపింది. ప్రతి తరగతికీ వారానికి ఆరు పీరియడ్లను ప్రత్యేకంగా వ్యాయామానికి కేటాయించాలని, ప్రతి విద్యార్థికీ రోజుకు కనీసం ఒకగంట శారీరక శ్రమ ఉండేలా చూడాలని ఆదేశించింది.