AP: రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు కలవరపెడుతున్నాయి. తాజాగా మరణాల సంఖ్య 22కి చేరింది. గత మూడేళ్లుగా చిత్తూరు జిల్లాలోనే దీని తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 491 వరకు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాకినాడ (198), విశాఖపట్నం (158) జిల్లాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. స్క్రబ్ టైఫస్‌ను సకాలంలో గుర్తిస్తే సమస్య ఉండదని వైద్యులు అవగాహన కల్పిస్తున్నారు.