W.G: మానసిక పరిపక్వత లేకుండా పెళ్లి చేసుకుంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని భీమవరం సివిల్ జడ్జి సుధారాణి అన్నారు. భీమవరం మండలం కొమరాడలో మంగళవారం న్యాయ అవగాహన సదస్సు జరిగింది. ఆడపిల్లకు 18 సం.లు, మగపిల్లవాడికి 21 సం.లు నిండకుండా పెళ్లి చేయరాదన్నారు. అలా చేస్తున్నట్లు మీ దృష్టికి వస్తే సంబంధిత అధికారులకుగానీ, పోలీస్ వారికి సమాచారం అందించాలన్నారు.