SRPT:ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు ఇవాళ సూర్యాపేటలోని బస్టాండ్లు, మార్కెట్లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. బాంబ్, డాగ్ స్క్వాడ్లతో లగేజీని తనిఖీ చేశారు. గంజాయి, డ్రగ్స్ రవాణా నిరోధించడమే లక్ష్యమని సీఐ వెంకటయ్య తెలిపారు. అనుమానితులకు లాడ్జీల్లో ఆశ్రయం ఇవ్వొద్దని, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.