SKLM: ఎచ్చెర్ల మండలం శ్రీవెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీలో మంగళవారం జరిగిన మెగా జాబ్ మేళాలో వివిధ ప్రాంతాలకు చెందిన 311 మందికి ఉద్యోగనియామక పత్రాలను స్థానిక ఎమ్మెల్యే నడికుదిటి ఈశ్వరరావు అందజేశారు. 14 కంపెనీలకు చెందిన యాజమాన్యాలు మంగళవారం వివిధ విద్యార్హతలున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఉద్యోగాల కోసం ఎంతో శ్రమించి తిరిగిన నిరుద్యోగులకు మంచి అవకాశమన్నారు.