SRD: సంగారెడ్డిలో తెలంగాణ మ్యాథ్స్ ఫోరం (TMF) ఆధ్వర్యంలో జిల్లా స్థాయి మ్యాథ్స్ కాంపిటీషన్ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఇందులో సిర్గాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన టెన్త్ విద్యార్థి అమర్ తన ప్రతిభను చాటి జిల్లాస్థాయి మొదటి బహుమతిని అందుకున్నాడు. ఈ సందర్భంగా సంబంధిత నిర్వాహకులు అమర్‌కు ప్రశంసా పత్రం, షీల్డ్ అందజేశారు.