AP: ప్రకాశం జిల్లా పొదిలిలో ఆర్యవైశ్య యువకుడిపై జరిగిన దాడిని మంత్రి డోలా ఖండించారు. ఘటనకు బాధ్యుడైన ఎస్ఐను ఇప్పటికే వీఆర్‌కు పంపినట్లు తెలిపారు. యువకుడు, అతడి కుటుంబసభ్యులను హోంమంత్రి అనిత పరామర్శించినట్లు చెప్పారు. కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. అధికారంలో ఉన్నా, లేకున్నా ఆర్యవైశ్యులకు ఎప్పుడూ అండగా ఉన్నామని మంత్రి భరోసా ఇచ్చారు.