Anasuya: యాంకర్ అనసూయ (Anasuya)- రౌడీ హీరో విజయ్ దేవరకొండ మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి అనసూయ (Anasuya).. ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓ వేడుకలో పాల్గొన్న ఆమె.. విజయ్ ఇష్యూ గురించి మాట్లాడారు. విజయ్ ఇక చాలు.. నీకు- నాకు జరుగుతున్న ఈ మాటల యుద్దాన్ని ఇక్కడితో ఆపేద్దాం అని.. గొడవకు ఫుల్ స్టాప్ పెట్టేద్దాం అని అనసూయ (Anasuya) రిక్వెస్ట్ చేశారు. తనపై ట్రోల్స్ చేసేందుకు డబ్బులు ఇచ్చారని తెలిసి చాలా బాధపడ్డారని వివరించారు. ఘటన జరిగిన తర్వాత విజయ్‌తో మాట్లాడేందుకు ట్రై చేశానని ఆమె వివరించారు.
గొడవ ఎలా మొదలైందంటే..?
విజయ్ తనకు మంచి ఫ్రెండ్ అని అనసూయ (Anasuya) తెలిపారు. అర్జున్ రెడ్డి మూవీలో మ్యూట్ చేసిన కొన్ని పదాలను సినిమా రిలీజ్ అయిన సమయంలో థియేటర్లో ఫ్యాన్స్‌తో పలికించారు. ఇలాంటివి ఎంకరేజ్ చేయొద్దని విజయ్‌తో చెప్పానని… అప్పటినుంచి తనపై ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయని వివరించారు. విజయ్‌కు సంబంధించిన ఓ వ్యక్తి తనను ట్రోల్ చేస్తున్నారని.. ఇందుకోసం మనీ ఇస్తున్నారని తెలిసి షాక్ అయ్యానని పేర్కొన్నారు.
ఇదంతా విజయ్‌కు తెలియకుండా జరుగుతుందని అనుకోలేదని అనసూయ (Anasuya) అన్నారు. అతను తనను ఎందుకు ద్వేషిస్తున్నాడో అర్థం కావడం లేదని చెప్పారు. అందుకే ఇక్కడితో ఆపి వేయాలని నిర్ణయం తీసుకున్నానని.. తనకు మానసిక ప్రశాంతత కావాలని అనసూయ చెబుతున్నారు. అందుకే ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేద్దాం అని కోరారు. మరీ రౌడీ హీరో ఎలా స్పందిస్తాడో చూడాలీ.