BHNG: సాధారణంగా వరి నాట్లు మహిళలే వేస్తుంటారు. కానీ, ఇటీవల మగవారు నాటేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. ఆంధ్ర నుంచి వచ్చిన మగ కూలీలు సాలు పద్ధతిలో యంత్రం తరహాలో నాట్లు పెడుతూ అబ్బురపరుస్తున్నారు. ఇవ్వాళ మోటకొండూరు మండలంలోని పెద్దబావి గ్రామంలో పలువురు రైతులు తమ పొలాల్లో మగ కూలీలతో నాట్లు వేయించారు. తక్కువ సమయంలో నాటు పూర్తి చేస్తున్నారని రైతులు తెలిపారు.