తమిళ డైరెక్టర్ రా. కార్తీక్ దర్శకత్వంలో కింగ్ నాగార్జున తన 100వ సినిమా చేస్తున్నారు. ‘కింగ్ 100’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీని తదుపరి షెడ్యూల్ కేరళలో జరగనున్నట్లు తెలుస్తోంది. ఇందులో నాగ్.. ‘కూలీ’లో కనిపించిన హెయిర్ స్టైల్‌తోనే కనిపించనున్నట్లు సమాచారం. ఈ మూవీకి ‘లాటరీ కింగ్’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు టాక్.