కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిను మాజీ సీఎం జగన్ పరామర్శించారు. ఇటీవల హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన తన రెండు మోకాళ్లకు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. విషయం తెలుసుకున్న జగన్ విరూపాక్షికి ఇవాళ స్వయంగా ఫోన్ చేసి ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.