ADB: ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ మంగళవారం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఎస్పీకి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో దేవత మూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు తీసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.