శ్రీకాకుళం: వైకుంఠ ఏకాదశి పర్వదినోత్సవం సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మంగళవారం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కుటుంబ సమేతంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. అధికారులు వారికి సాదరంగా ఆహ్వానం పలికారు. స్వామివారి అనుగ్రహంతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలని, రాష్ట్రం దశ దిశల అభివృద్ధి చెందాలని అన్నారు.