ప్రకాశం: పలు కేసులలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మార్కాపురం పట్టణ ఎస్సై సైదులు బాబుకు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రశంస పత్రం అందజేశారు. ఒంగోలు పోలీస్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రతిభకనబరిచిన పోలీస్ అధికారులకు ఎస్పీ ప్రశంస పత్రాలు అందజేశారు. ఎస్సై సైదుబాబు దొంగతనాలు రికవరీ చేసిన కేసులలో ప్రతిభ కనబరిచినందుకు ఎస్పీ ప్రశంస పత్రం అందజేసే అభినందనలు తెలిపారు.