టీమిండియా స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన ఒక అరుదైన రికార్డుకు చేరువలో ఉంది. ఆమె మరో 62 పరుగులు చేస్తే, 2025లో అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టిస్తుంది. ప్రస్తుతం ఆమె అన్ని ఫార్మాట్లలో కలిపి 1,703 పరుగులు చేసింది. ఈరోజు శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో ఆమె 62 పరుగులు చేస్తే.. గిల్(1,764 పరుగులు) రికార్డును అధిగమిస్తుంది.