తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. స్వామివారికి ధనుర్మాస కైంకర్యాల అనంతరం భక్తులను వైకుంఠ ప్రదక్షిణగా అనుమతించారు. కాగా తొలి 3 రోజులు ఈ-డిప్ ద్వారా టోకెన్లు పొందినవారిని అనుమతిస్తారు. జనవరి 2-8 తేదీల్లో టోకెన్లు లేనివారికీ అవకాశం కల్పిస్తారు. ఇక వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల ప్రాకారాలు, గోపురాలు విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా కనిపిస్తున్నాయి.