WGL: రాయపర్తి మండలంలోని పెరిక వేడు గ్రామానికి చెందిన అయ్యప్ప మాలదారుడు తోటకూరి దేవరాజ్ (23) కరెంట్ షాక్తో మృతి చెందాడు. ఇవాళ స్నానం చేసి బట్టలను ఆరవేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.