కోనసీమ: జనవరి నెలకు సంబంధించి ప్రభుత్వం మంజూరు చేసిన ఎన్టీఆర్ భరోసా పథకం పెన్షన్లను లబ్ధిదారులకు డిసెంబర్ 31వ తేదీ నాడే అధికారులు, సిబ్బంది అందించాలని కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద నుండి ఆయన అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెన్షన్ల పంపిణీపై సూచనలు చేశారు.