ATP: ఎమ్మెల్యే బండారు శ్రావణి సోమవారం తిరుపతిలోని పలు దేవాలయాలను దర్శించుకున్నారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారు, శ్రీనివాస మంగాపురం, తిరుమలలోని వారాహి స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.