KRNL: మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠంలో సోమవారం హుండీ లెక్కింపు చేపట్టారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 3,73,66,587ల ఆదాయం వచ్చినట్లు మేనేజర్ ఎస్కే శ్రీనివాసరావు తెలిపారు. 87 గ్రాముల బంగారం, 910 గ్రాముల వెండి వస్తువులు లభించాయని పేర్కొన్నారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో సిబ్బంది, బాలాజీ సేవా ట్రస్ట్ సభ్యులు, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.