MHBD: సీఎంను విమర్శించే అర్హత ఎర్రబెల్లికి లేదని తొర్రూర్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్లు అన్నారు. తొర్రూర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు అత్యధిక సంఖ్యలో గెలుపొందారని, అది చూసి జీర్ణించుకోలేని ఎర్రబెల్లి మతిభ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.