AP: విశాఖ పోర్టు అథారిటీ డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా మహిళా IAS అధికారిణి రోష్ని అపరాంజి నియమితులయ్యారు. విశాఖ పోర్టులో ఈ పదవిని చేపట్టిన తొలి మహిళా IAS అధికారిణిగా ఆమె చరిత్ర సృష్టించారు. అసోం-మేఘాలయ కేడర్‌కు చెందిన రోష్ని.. తన విద్యాభ్యాసమంతా విశాఖలోనే పూర్తి చేశారు. కాగా, ఆమె తండ్రి విశాఖ పోర్టు హైస్కూల్లో ప్రధానోపాధ్యాయుడిగా సేవలందించారు.