నటి మాధవీలతపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆమెతో పాటు పలువురు యూట్యూబర్లపై కూడా కేసు నమోదైంది. సాయిబాబా దేవుడు కాదు అంటూ మాధవీలత, యూట్యూబర్లు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు రేపు ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని వారికి నోటీసులు జారీ చేశారు.