AP: గతేడాదితో పోలిస్తే ఈసారి రాష్ట్రంలో క్రైమ్ రేట్ చాలా తగ్గిందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. మహిళలకు రక్షణ, మత్తుపదార్థాల రవాణా, సెల్ఫోన్ల రికవరీలో పురోగతి సాధించినట్లు చెప్పారు. పదేళ్లలో పోలీసింగ్ ఎలా ఉంటుందనే దానిపై సంక్రాంతి పండుగ తర్వాత 2 రోజులపాటు వర్క్‌షాప్ ఉంటుందని డీజీపీ వెల్లడించారు.