GDWL: చిన్నారులకు 5 ఏళ్లు, 15 ఏళ్లు నిండిన తర్వాత వారి శారీరక మార్పులకు అనుగుణంగా ఆధార్లో బయోమెట్రిక్ వివరాలను ఖచ్చితంగా నవీకరించుకోవాలి అని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. సోమవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ అప్డేట్ చేయకపోతే ప్రభుత్వం పథకాలు సద్వినియోగం చేసుకోలేరన్నారు.