కరీంనగర్ జిల్లాలో వివిధ గ్రామాలలో ఈనెల 30న పౌరహక్కుల దినోత్సవం అధికారులు నిర్వహించనున్నారు. వెలిచాల, బహుదూర్ ఖాన్ పేట, కొండపల్కల, పొరండ్ల, పారువెల్ల, మధురానగర్, రామడుగు, దేవునిపల్లి, చిగురుమామిడి, వీణవంక, వెన్నంపల్లి, గద్దపాక, కాట్రపల్లి, పాపయ్యపల్లి, వంతడపుల గ్రామాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొంటారు.