KMR: నూతన సంవత్సరం ఆనందంగా ప్రారంభం కావాలి గానీ, నిర్లక్ష్యం వల్ల విషాదంగా మారకూడదని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రజల ప్రాణ భద్రతే ప్రధాన లక్ష్యంగా జిల్లా పోలీసులు పకడ్బందీ కార్యాచరణతో ముందస్తు చర్యలు చేపట్టినట్లు సోమవారం తెలిపారు. మద్యం మత్తులో వాహనాలు నడపరాదన్నారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.