MDK: గోవా విహారయాత్రకు వెళ్లిన యువకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నర్సాపూర్ పట్టణానికి చెందిన పలువురు 15 మంది యువకులు మూడు కార్లలో గోవా విహారయాత్రకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో సోలాపూర్ వద్ద కారు బోల్తా పడడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో రిహాన్, పవన్ కుమార్ అనే ఇద్దరు యువకులు అక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలైనట్లు బంధువులు తెలిపారు.