W.G: భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారి 62వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారి మూలవిరాట్‌కు కళపకర్షణ నిమిత్తం ఈ నెల 17 నుంచి అమ్మవారి దర్శనాలను ఆలయ అధికారులు, వేద పండితులు నిలిపివేశారు. 11 రోజుల అనంతరం నేడు ప్రత్యేక పూజలు, హోమాలు అనంతరం అమ్మవారి దర్శనం పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అమ్మవారిని దర్శించుకున్నారు.