KRNL: గోనెగండ్ల మండలంలో పారిశుద్ధ్య కార్మికులకు సరైన సమయంలో జీతాలు అందక వారు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని, జీతాలు మంజూరు చేయాలని సోమవారం బీఎస్పీ ఎమ్మిగనూరు అసెంబ్లీ అధ్యక్షుడు అంద్రి బంగారప్ప డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎంపీడీవో ఆఫీసును పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ముట్టడిస్తామని హెచ్చరించారు.