న్యూజిలాండ్ స్టార్ ఆల్రౌండర్ డగ్ బ్రేస్వెల్ అన్ని ఫార్మాట్లలో క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కొన్ని రోజులుగా అతడు పక్కటెముకల గాయంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ కెరీర్లో కివీస్ తరఫున 28 టెస్టులు, 21 వన్డేలు, 20 టీ20 మ్యాచులు ఆడాడు. టెస్టుల్లో 74 వికెట్లు తీయడంతోపాటు 568 పరుగులు చేశాడు.