కృష్ణా: కంకిపాడులో మాజీ కౌన్సిలర్ చిట్టిబాబు వర్ధంతి సందర్భంగా ఆయన తమ్ముడు కన్నయ్య ఏర్పాటు చేసిన దుప్పట్లను టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చలికాలంలో పేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ చేయడం మంచి కార్యక్రమమని అన్నారు. పేదవారికి సాయం చేస్తే దేవుడు ఆశీస్సులు మనకి ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు.