ప్రకాశం: తర్లుపాడు మండలం మేకలవారిపల్లి టోల్ ప్లాజా వద్ద ఉన్న MSME ఇండస్ట్రియల్ పార్కును ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా జరుగుతున్న పనులను పరిశీలించిన ఆయన సంబంధిత అధికారులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అభివృద్ధి దిశగా ప్రయాణిస్తుందని ఎమ్మెల్యే వెల్లడించారు.