NRML: భారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన కూచిపూడి కళావైభవం-2లో పట్టణంలోని ఇంద్రానగర్కి చెందిన హస్యశ్రీ అద్భుత ప్రదర్శన చేపట్టి గిన్నిస్ రికార్డులో చోటు సంపాదించుకుంది. ఈ సందర్భంగా సోమవారం నాట్య గురువు నవ్యతో పాటు, పట్టణవాసులు హస్యశ్రీని అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.