HYD: శాసనసభలో తొలిసారి మాట్లాడిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించారు. కృష్ణానగర్‌లో డ్రైనేజీ, మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోరారు. హైటెన్షన్ వైర్లు తొలగించి అండర్‌గ్రౌండ్ కేబుల్స్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల కోసం ప్రభుత్వ డిగ్రీ, ఇంటర్ కళాశాలలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.